స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో రాణించాలని ఆశపడు తుంది. ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అవి ఫలిస్తున్నాయి, కూడా. తాజాగా బాలీవుడ్ నుంచి సమంత బంపర్ ఆఫర్ ఒకటి కొట్టేసిందట. ఏకంగా సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుందట. గతంలో సల్మాన్ నటించిన 'నో ఎంట్రీ సీక్వెల్ లో సమంతను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇదే చిత్రంలో రష్మిక మందన్న, పూజా హెగ్గే, తమన్నా కూడా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత యశోధ, ఖుషి సినిమాల్లో నటిస్తున్నారు. ఇక గుణశేఖర్ దర్శక త్వంలో ఆమె నటించిన 'శాకుంతలం' రిలీజ్ కు రెడీగా ఉంది.