కరణ్ మల్పోత్ర దర్శత్వంలో రణ్ బీర్ కపూర్ - వాణీ కపూర్ జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ షంషేరా'. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి రణ్ బీర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా సంజయ్ దత్, వాణీ కపూర్ ల ఫస్ట్ లుక్స్ వదిలారు. దరోగ శుబ్ సింగ్ పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ లో చేతిలో యమపాశం పట్టుకొని భయంకరంగా దర్శన మిచ్చాడు. ఇక సోనా పాత్రలో వాణీ కపూర్ మ్యాజికల్ లుక్ లో కనిపించింది. ఇందులో రణ్ బీర్ 1800 కాలం నాటి స్వాతంత్ర్య కాంక్ష కలిగిన, దోపిడీ ముఠా నాయకుడిగా కనిపిం చనున్నాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తోంది. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.