ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భవదీయుడు భగత్ సింగ్' సినిమా పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 01:31 PM

హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమాలో అవార్డ్ విన్నింగ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ మూవీలో పవన్ కళ్యాణ్‌ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించనుంది. తాజా అప్డేట్ ప్రకారం, పవన్ తన రాజకీయ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నందున ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి వాయిదా వేయాలని మైత్రీ మూవీ మేకర్స్‌ని కోరినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ అభిమానులు పవన్ అండ్ హరీష్ కాంబో లో రానున్న సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ పవర్ ఫుల్ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa