పెళ్లి చూపులు మరియు ఈ నగరానికి ఏమైంది వంటి హిట్ సినిమాలకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ దాస్యం కామెడీ మరియు యూత్ ఫుల్ సినిమాలను తీయడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈసారి క్రైమ్ కామెడీతో వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి 'కీడా కోలా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa