బిగ్ బాస్ ఇల్లు పెళ్లి ఇల్లుగా మారింది. రాధాక్రిష్ణ, మధులత వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 73లో వినూత్న రీతిలో పెళ్లివేడుక టాస్క్‌ను మొదలుపెట్టారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుకలో మెహిందీ, పెళ్లి, సంగీత్ ఇలా సంపూర్ణ పెళ్లి వేడుకకు బిగ్ బాస్ హౌస్ ముస్తాబు అయ్యింది.
ఈ పెళ్లి తంతు టాస్క్‌కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బంధువులు, స్నేహితులు ఇలా రెండు టీంలుగా విడిపోయి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ రాధాక్రిష్ణ, మధులతల బొమ్మల పెళ్లి వేడుకకు పంతులుగా గణేష్ వ్యవహరించారు. ఈ పెళ్లి టాస్క్‌లో భాగంగా.. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల మధ్య వెరైటీ టాస్క్‌లు జరిగాయి.
తొలిత స్మిమ్మింగ్ ఫూల్‌లో ఉంచిన ఉంగరాలను వెతికిపట్టుకునే టాస్క్ ఇవ్వగా.. దీప్తి నల్లమోతు, సామ్రాట్‌లు స్మిమ్మింగ్ ఫూల్‌లో తలపడ్డారు. ఇక హౌస్‌లో దాచి ఉంచిన చెప్పుల జతలను వెతికి పట్టుకునేందుకు పెళ్లికూతురు తరుపున అమిత్, గీతా మాధురి, తనీష్, గణేష్, పూజాలు కష్టపడి 20 జతల చెప్పులకు పట్టుకున్నారు. బహుమతులు గెలుచుకునేందుకు పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు లడ్డూలను చుట్టడం, పెళ్లి కుమారులకు దుపట్టాలను అలంకరించడం లాంటి సరదా టాస్క్‌లను ఇచ్చారు. ఈ సరదా సరదా టాస్క్‌లు జరుగుతుండగానే వివాహ వేడుకకు పెళ్లి పెద్దగా ఎనర్జిటిక్ ఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్ రంగమ్మత్త అనసూయ.
రారండోయ్ వేడుక చూద్దాం.. అంటూ పెళ్లి వేడుక సాంగ్‌తో పళ్లెం పట్టుకుని బిగ్ బాస్ హౌస్‌లో రెండు టీంల మధ్య జరుగుతున్న రాధాక్రిష్ణ, మధులతల బొమ్మల పెళ్లిలో రంగమ్మత్త స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. వేడుకకు విచ్చేసిన రంగమ్మత్తకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు కంటెస్టెంట్స్. బుల్లి తెరపై తనదైలి అంద చందాలతో ఆకట్టుకునే రంగమ్మత్త బిగ్ బాస్ హౌస్‌లో జరిగే పెళ్లి వేడుక కోసం ప్రత్యేకంగా తయారై వచ్చింది. చీరతో సింగారించుకుని అందచందాలతో ఆకట్టుకుంది. ఇక పెళ్లికి వచ్చిన అనసూయను మీరు పెళ్లి తరుపున ఉంటారా? పెళ్లి కొడుకు తరపున ఉంటారా అనడంతో తనకి ఇద్దరు కొడుకులు ఉండటంతో పెళ్లి కూతురు తరుపునే ఉంటానని చెప్పింది. మరి రేపు జరిగే పెళ్లి సంగీత్‌తో అనసూయ అత్త పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక టాస్క్ సంగతి పక్కనపెడితే.. ఈ పెళ్లి వేడుక కాన్సెప్ట్ ప్రేక్షకులకు విసుగుపుట్టించింది. బొమ్మల పెళ్లికి కంటెస్టెంట్స్ రెండు టీంలుగా విడిపోయి వాళ్ల పాత్రల్లో నటించడం.. కొంతమంది అయితే జీవించేయడంతో ప్రేక్షకులకు పరీక్షపెట్టేశారు. రేపు కూడా ఇదే తంతు ఉండటంతో తూతూ మంత్రంగా రెండు రోజులపాటు లాగించేస్తారో.. లేక అదనపు హంగులు దిద్దుతారో చూడాలి
Bigg Boss house lo anga ranga vaibhavanga pelli vedukalu #BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/upa10IxAxB
— STAR MAA (@StarMaa) August 22, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa