'మనం' కాంబోలో రెండో మూవీగా తెరకెక్కుతున్న చిత్రం "థాంక్యూ". విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం పై అక్కినేని అభిమానులు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. టీజర్ తో ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఇంటరెస్ట్ చూపించారు. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూలై 8న విడుదలవుతుందనుకున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. జులై 22 న థియేటర్లలో సినిమా విడుదలవుతుందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫేర్ వెల్ అనే పాటను విడుదల చేస్తున్నామని కొంచెం సేపటి క్రితమే చిత్రబృందం ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఒక స్పెషల్ ఈవెంట్ లో ఈ పాట విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa