రాకెట్రీ చిత్ర ప్రమోషన్స్‌లో చేసిన పంచాంగం వ్యాఖ్యలపై నటుడు మాధవన్ వివరణ ఇచ్చారు. పంచాంగం చూసి పెట్టిన ముహూర్తబలం వల్లే ఇస్త్రో ప్రయోగం విజయవంతమైందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా వీటిపై మాధవన్ స్పందించారు. ఈ విమర్శలకు తాను అర్హుడినేనని అన్నారు. అయితే, తాను ఈ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఇంజిన్లు ఉపయోగించి మార్స్ మిషన్ విజయవంతం చేయడం నిజంకాకుండా పోదన్నారు.