ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూల్లో పక్కా "కమర్షియల్" మీటింగ్ గ్రాండ్ ఈవెంట్...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 06:56 PM

వినోదభరిత చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో యాక్షన్ హీరో గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రం "పక్కా కమర్షియల్". గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. పలు వాయిదాల తర్వాత జూలై 1వ తేదీన ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ మూవీ నిన్న ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఆ ఈవెంట్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా హాజరై సినిమాకు తగినంత ప్రొమోషన్ చేసారు.
తాజాగా పక్కా కమర్షియల్ మూవీ కర్నూల్ లో కమర్షియల్ మీటింగ్ పేరిట మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంటుంది. ఈ మేరకు మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. దీని ప్రకారం, జూన్ 29వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి, కర్నూలు కన్వెన్షన్ సెంటర్ లో ఈ కమర్షియల్ మీటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరన్నది మేకర్స్ ప్రకటించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa