ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగింపు దశకు చేరుకున్న "ఆదిపురుష్" పోస్ట్ ప్రొడక్షన్ పనులు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 06:17 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో, మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం "ఆదిపురుష్". ఓం రౌత్ - అజయ్ దేవగణ్ కాంబోలో వచ్చిన తాన్హాజి ఉత్తరాదిన ఘనవిజయం సాధించింది. తాన్హాజి తదుపరి ఓం రౌత్ చేసున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రభాస్ రాఘవ పాత్రలో, కృతిసనన్ జానకి పాత్రలో, సైఫ్ అలీఖాన్ లంకేష్ పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. రూ. 500కోట్ల బడ్జెట్ తో టి సిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్నాయి. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంతిమ దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. బాహుబలి కన్నా పదిరెట్లు మెరుగ్గా ఉండే VFX ఎఫెక్ట్స్ ను ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారట. ఇప్పటికే సినిమాలోని ప్రధాన తారాగణం డబ్బింగ్ స్టార్ట్ చేశారంట. త్వరలోనే ప్రభాస్ కూడా ఈ మూవీ డబ్బింగ్ ను స్టార్ట్ చేస్తారంట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa