రొమాంటిక్ చిత్రాల హీరోగా కోలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న మాధవన్ తొలిసారి మెగాఫోన్ పట్టి చేస్తున్న చిత్రం "రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్". టైట్యులర్ రోల్ లో మాధవన్ నటిస్తూ, సినిమాకు రచయితగా, డైరెక్టర్ గా కూడా పనిచేసారు. రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణ్ ఎదుర్కొన్న ఒక విపరీత పరిస్థితిని ఆధారంగా చేసికొని ఈ సినిమా తెరకెక్కింది. ఇంగ్లీష్, హిందీ ,తమిళ భాషలలో జూలై 1న ఈ సినిమా విడుదల కానుంది. రీసెంట్గా జరిగిన 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో, ఇండియా తరపున ప్రదర్శింపబడిన ఐదు సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ మూవీ స్క్రీనింగ్ కు స్టాండింగ్ ఒవేషన్ గౌరవం కూడా దక్కిందని సమాచారం.
తాజాగా ఈ మూవీ కోసం మాధవన్ ఎంత కష్టపడ్డారో తెలిపే అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టైటిల్ పాత్ర లుక్ కోసం మాధవన్ దాదాపు పద్దెనిమిది గంటలపాటు కుర్చీలోనే గడిపాడట. ఎలాంటి ప్రొస్థెటిక్స్ జోలికి పోకుండా కేవలం మేకప్ తోనే ఈ లుక్ ను తీసుకొచ్చారట. మరి ఇలాంటి మేకప్ ను షూటింగ్ లో ఎన్నిసార్లు వేసుకున్నాడో, ఎన్ని గంటలు కుర్చీలో కదలకుండా కూర్చున్నాడో... వీటిపై మూవీ టీం అప్డేట్ ఇస్తే బావుంటుంది. అది సినిమాపై మరింత ప్రచారం కల్పిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa