బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు లక్ష్మణ్ కే. కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం స్వాతిముత్యం. నిన్న ఈ మూవీ నుండి "నీ చారెడు కళ్ళే" అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. విడుదలైన 24గంటల్లోపే ఈ పాటకు ఒక మిలియన్ కు పైగా వ్యూస్, 100కే లైక్స్ వచ్చాయని తెలుస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మెలోడియస్ అండ్ సూథింగ్ మ్యూజిక్ కు తెరపైన అద్భుతమైన రూపకల్పన ఇవ్వడంతో ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతీ స్వరసాగర్ సంగీతమందించిన ఈ మూవీ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
![]() |
![]() |