"మత్తువదలరా" ఫేమ్ రితేష్ రానా డైరెక్షన్లో రూపొందిన కొత్త చిత్రం "హ్యాపీ బర్త్ డే". ఇందులో లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ రోల్ ను పోషిస్తుండగా, అగస్త్య నందా, వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ కీలకపాత్రలను పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలై 8వ తేదీన విడుదలకానుంది.
ఇటీవల ఈ మూవీ నుండి రిలీజైన లావణ్య ఫస్ట్ గ్లిమ్స్ కు, టీజర్ ను ప్రేక్షకుల నుండి విశేష స్పందన దక్కింది. తాజాగా రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు.
![]() |
![]() |