కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల చేత వందకు వంద మార్కులు వేయించుకున్నాడు హీరో అల్లరి నరేష్. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". ఈ చిత్రానికి ఏ. ఆర్. మోహన్ డైరెక్టర్ కాగా, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ప్రీ టీజర్ రిలీజయ్యింది. షూటింగ్ జరిగిన 55 రోజుల్లో, చిత్రబృందం ఎంత కష్టపడిందో ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని 22 నిగూఢ ప్రదేశాల్లో, తెల్లవారు ఝామున 3 గంటలకు ట్రెక్కింగ్ , షూటింగ్ స్పాట్ కు చేరుకోవటానికి 6 కిలోమీటర్ల కాలినడక ... ఇలా నటీనటులతో సహా చిత్రబృందంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం పడ్డ కష్టాన్ని ఈ వీడియోలో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజులో ఉంది. జూన్ 30వ తేదీన టీజర్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
![]() |
![]() |