ప్రముఖ టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ దిల్ రాజుకు పోటీగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను అవతరించిన విషయం తెలిసిందే కదా. గతంలో క్రాక్, నాంది, ఇష్మార్ట్ శంకర్ వంటి క్రేజీ సినిమాల నైజాం హక్కులను కొని చేతినిండా లాభాలను గడించాడు. శర్వానంద్ నటించిన శ్రీకారం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు,ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమా నైజాం హక్కులను కూడా శ్రీను నే కొన్నాడు. ఈ సినిమాలతో కొంచెం దెబ్బ తిన్న శ్రీను ఆచార్య హక్కులను భారీ ధరకు కొని పూర్తిగా నష్టాల్లోకి కూరుకుపోయాడు. ఆచార్య ఎఫెక్ట్ నుండి కోలుకోవడంలో భాగంగా, మరో పెద్ద సినిమా తెలుగు హక్కులను భారీ ధరకు కొని కెరీర్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా, అనూప్ భండారి డైరెక్షన్లో రూపొందిన విక్రాంత్ రోణ మూవీ తెలుగు రైట్స్ ను, వరంగల్ శ్రీను సొంత నిర్మాణ సంస్థైన కార్తికేయ ఎక్షిబిటర్స్ చేజిక్కించుకుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే బలమైన నమ్మకంతో వరంగల్ శ్రీను ఈ మూవీ హక్కులను కొనుక్కున్నట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 28న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి, వరంగల్ శ్రీను ఆచార్య నష్టాలను అధిగమించి లాభాలను మిగల్చాలని కోరుకుందాం.
![]() |
![]() |