నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఆపర్చ్యునిటీని, డైరెక్టర్ గా మారిన అనతికాలంలోనే కొట్టేసాడు అనిల్ రావిపూడి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ గురించి అధికారిక ప్రకటన జరిగింది. కెరీర్ లో అపజయమెరుగని అనిల్ దర్శకత్వంలో, అఖండ విజయంతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య నటిస్తుండడంతో ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ మూవీపై ఒక కొత్త అప్డేట్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, బాలయ్య సినిమాకు సంబంధించి పూర్తి కథను సిద్ధం చేసుకున్న అనిల్, తాజాగా స్క్రీన్ ప్లే ను రూపొందించే పనిలో తన బృందంతో కలిసి చాలా బిజీగా ఉన్నాడట. స్క్రిప్ట్ పనులను పూర్తి చెయ్యడానికి మరో వారం రోజులు పడుతుందట. ఆపై ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టి, వచ్చే ఆగస్టు నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారట.
![]() |
![]() |