టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలోనే "ది వారియర్" గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ సరసన కృతిశెట్టి, అక్షర గౌడ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా కనిపిస్తుండగా, నదియా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 14వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమా నుండి బుల్లెట్, దడ దడ, విజిల్ అనే లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేయగా ఆ పాటలకు యూట్యూబులో మిలియన్లకొద్దీ వ్యూస్ లభిస్తున్నాయి.
దేవిశ్రీప్రసాద్ ఎనర్జిటిక్ మ్యూజిక్ కు, రామ్,కృతిల మాస్ స్టెప్పులు జత కలవడంతో ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే 12 మిలియన్ వీక్షణలతో యూట్యూబ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పాటను ఆంథోనీ దాసన్, శ్రీనిష ఆలపించగా, సాహితి లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.