ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా 2021 డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన పుష్ప నార్త్ టూ సౌత్ భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఈ సినిమాలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ నంబర్స్ కాగా.. స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావాకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే ఊపులో ఆమె మరో ఐటం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి. అయితే ఏ చిత్రంలో..ఏంటా విషయం అంటే...
'పుష్ప'లో 'ఊ అంటావా.. సాంగ్' తో సమంత హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. ఆ పాటతో హిందీ ఆడియెన్ గుండెల్లో సామ్ చెరగని ముద్ర వేసింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో బోల్డ్ పెర్ఫామెన్స్ తర్వాత ఈ ఐటం సాంగ్ ఓ రేంజిలో క్లిక్ అయ్యంది. వీటికి తోడు.. వరుసగా బోల్డ్ ఫోటోషూట్లు ఇంటర్నెంట్ ని షేక్ చేస్తున్న తెలిసిందే. తాజాగా సమంత మరో ఐటమ్ నంబర్ కి ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో సామ్ ఓ హాట్ ఐటమ్ నంబర్ లో దుమ్ము రేపనుందని టాక్ వినిపిస్తోంది.
ఐటం సాంగ్స్ అనేవి మాస్ కమర్షియల్ సినిమాల్లో ఓ కొత్త ఊపును తీసుకొస్తాయి. కమర్షియల్ సినిమాలకు ఫైట్స్ ఎంత ముఖ్యమో.. స్పెషల్ సాంగ్ కూడా అంతే ముఖ్యం అంటారు సీనియర్స్. అందుకే యానిమల్ లో ఊర మాస్ యాక్షన్ కు తోడుగా 'ఊ అంటావా.. ఊఊ అంటావా' లాంటి మరో ఐటం సాంగ్ ని పెడుతున్నట్లు సమాచారం.
![]() |
![]() |