ఒక్క సినిమా చాలు నటీనటుల జీవితం మారిపోవడానికి. 'అర్జున్ రెడి' బాలీవుడ్ రీమేక్ తో 'కబీర్ సింగ్' కియారా అద్వానీ లైఫ్ మారిపోయింది. బిజీ హీరోయిన్ అయిపోయింది. వరుసగా అవ కాశాలు అందుకుంటోంది. బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతుంది. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ పట్టిందల్లా బంగారమే. కార్తీక్ ఆర్యన్ కి జంటగా ఆమె నటించిన 'భూల్ భూలయ్యా 2' గత నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక వరుణ్ ధావన్ - కియారా జంటగా నటించిన 'జగ్ జగ్ జీయో' గత వారమే
ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఇలా.. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో యంగ్ బ్యూటీ దూసుకుపోతుంది. ప్రస్తుతం మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో(#RC15, గోవింద్ మేరా నామ్) నటిస్తోంది.