తెరపై ఎంత గ్లామర్ గా కనిపించినా, బయట ఎన్ని ఎఫైర్లు నడిపినా.. బయటికి మాత్రం రొమాన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అన్నట్టు పోజులు కొడతారు ముద్దుగుమ్మలు. ఐతే కమర్షియల్ పోరి రాశీఖన్నా మాత్రం అందుకు భిన్నంగా 'ఐ లైక్ రొమాన్స్' అంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చింది. హీరోలతో రొమాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నా దృష్టిలో అది చాలా ఈజీ. కానీ రొమాన్స్ చేసి బోర్ కొట్టేసింది. అందుకే ప్రస్తుతం కామెడీ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొ చ్చింది. ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు సినిమాలు పక్కా కమర్షియల్, థ్యాంక్యూ జులై నెలలోనే రిలీజ్ కానున్నాయి. జులై 1న పక్కా కమర్షియల్, జులై 22న థాంక్యూ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి