పా. రంజిత్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం కబాలి. ఇందులో రజిని కూతురిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది సాయి ధన్సిక. ఆ సినిమాకుగాను ధన్సిక ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.
"షికారు" చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమవబోతుంది. ఈ చిత్రాన్ని హరి కొలగాని డైరెక్షన్ చెయ్యగా, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్ లు హీరోలుగా నటిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ సాయిలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై పి ఎస్ ఆర్ కుమార్ నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ జూలై 1వ తేదీన విడుదల కాబోతుంది. అన్నపూర్ణ, సురేఖ వాణి తదితరులు ఈ సినిమాలో నటించారు.
![]() |
![]() |