హరి శంకర్, హరీష్ నారాయణ్ ల దర్శకద్వయం తెరకెక్కిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ యశోద. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావురమేష్, మురళీశర్మ, సంపత్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయామొకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే.., మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యమవుతుండడంతో విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సమంత పుట్టినరోజును పురస్కరించుకుని యశోద ఫస్ట్ గ్లిమ్స్ రిలీజైన సమయంలోనే ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సమంత అభిమానులు ఉసూరుమంటున్నారు.