ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ "కార్తికేయ 2" ఓటిటి పార్టనర్ ఖరారు...

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 07:15 PM

చందు మొండేటి డైరెక్షన్లో హీరో నిఖిల్ సిద్దార్ధ్ నటించిన చిత్రం "కార్తికేయ 2". గతంలో ఇదే కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, ఆదిత్య మీనన్ కీలకపాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన కార్తికేయ ట్రైలర్ 1 కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా కార్తికేయ 2 డిజిటల్ పార్టనర్ ఖారైనట్టు తెలుస్తుంది. థియేటర్ విడుదలకు ముందే నిర్మాతలు ఆయా సినిమాల డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను అమ్మేయడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. కార్తికేయ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ జీ 5 ఓటిటి సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన సినిమా విడుదలైన తర్వాత జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com