టాలీవుడ్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం "ఏజెంట్". సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సాక్షివైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కాబోతుంది.
తాజాగా అఖిల్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టోరీతో మరోసారి ఈ సినిమా న్యూస్ లో కొచ్చింది. ఈ వీడియోలో కండలు తిరిగిన దేహంతో అఖిల్ చేసే తీవ్రమైన కసరత్తులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతటి తీవ్రమైన కష్టాన్ని అనుభవిస్తున్నాడో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. పాన్ ఇండియా భాషల్లో విడుదలవబోతున్న ఈ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ టు సినిమా సంస్థలు భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నాయి.