టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ". శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదల కావాల్సివుంది కానీ, కొన్ని కారణాల వల్ల జూలై 29కి వాయిదా పడింది.
RT టీం వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నఈ చిత్రం నుండి తాజాగా మంచి మాస్ మసాలా ఐటెం సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. నా పేరు సీసా అని సాగే ఈ పాటను శ్రేయా ఘోషల్ ఆలపించగా, చంద్రబోస్ సాహిత్యమందించారు. సామ్ సీ ఎస్ సంగీతం అందించిన ఈ పాటను పూర్తిగా జూలై 2వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.