నాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, రవి శంకర్ నిర్మించారు. జూన్ 10న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ మూవీ నుండి ఓరోరి ...సంచారి సాంగ్ కు సంబంధించిన ఫుల్ వీడియోను చిత్రబృందం యూట్యూబులో రిలీజ్ చేసారు.సినిమాలోని మెయిన్ క్రిటికల్ సిట్యుయేషన్ లో వచ్చే ఈ పాటలో నాని, నజ్రియా లిద్దరూ తమ కుటుంబ పెద్దలకు ఏదో సీక్రెట్ ను చెప్పలేక ఇబ్బంది పడుతుంటారు. వివేక్ సాగర్ స్వరకల్పనలో రూపొందిన ఈ గీతానికి సానపతి భరద్వాజ్ పాత్రుడు చక్కని సాహిత్యాన్ని అందించారు. సింగర్ సచిన్ బాలు ఎంతో అద్భుతంగా ఆలపించారు.