దేశప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చెయ్యకుండా వరస ఫారిన్ ట్రిప్ లేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేశవ్యాప్తంగా పుష్ప తెచ్చిన అనూహ్య స్టార్డం అండ్ ఇమేజ్ తో ఇప్పుడు బన్నీ ఏం చేసినా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. తాజాగా బన్నీ కుటుంబంతో కలిసి ఫారిన్ వెకేషన్ కెళ్ళడం కూడా మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. పుష్ప గ్రాండ్ సక్సెస్ తర్వాత గోవా, లండన్, దుబాయ్ లలో ఎంజాయ్ చేసొచ్చిన బన్నీ కుటుంబం గత ఆర్నెల్లలో మూడు వెకేషన్ లకెళ్ళొచ్చింది. తాజాగా నాలుగో వెకేషన్ లో భాగంగా బన్నీ అండ్ టీం కలిసి టాంజానియాకెళ్ళారంట. అక్కడే కొన్ని రోజులుండి ఆపై ఇండియాకి తిరిగొచ్చి పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారంట.