సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి విడుదలైన కొత్త చిత్రం సర్కారువారిపాట. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మహేష్ మాస్ యాక్టింగ్ కు, డైలాగ్స్ కు, స్టైలిష్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ కు జనాలు నీరాజనాలు పలికారు. మే 12న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతూ ఐదు రోజులలోనే రూ. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ కథానాయికగా నటించింది.
ఇటీవలే మ మ మ మాస్ సెలెబ్రేషన్స్ పేరిట SVP సక్సెస్ సెలెబ్రేషన్స్ ను నిర్మాతలు ఘనంగా నిర్వహించారు. జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా థియేటర్లలో యాభై రోజులను పూర్తి చేసుకుందని మేకర్స్ కొంచెంసేపటి క్రితమే ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ఎనౌన్స్ చేసారు. ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్లలో యాభై రోజులను పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన సినిమాల్లో బాలయ్య నటించిన అఖండ, ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు మాత్రమే ఈ ఫీట్ ను సాధించాయి. తాజాగా మహేష్ SVP కూడా ఈ లిస్టులో జాయిన్ అవ్వడం పట్ల సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.