ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యిందంటే, ఆ మూవీ హీరో, దర్శకుడిపై ప్రేక్షకులు స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తుంటారు. ఆ కాంబోలో మరో సినిమా వస్తుందంటే ఆడియన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇలాంటి ఫేవరేట్ హీరో - డైరక్టర్ కాంబోలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అందులో నేటి యువతరం బాగా ఇష్టపడే కాంబో పూరీజగన్నాధ్ - విజయ్ దేవరకొండ.
పూరి-విజయ్ కాంబోలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదలవ్వలేదు. కానీ పూరి డాషింగ్ డైరెక్షన్ కు రౌడీ హీరో విజయ్ తోడవడంతో వీరి కాంబోలో రూపొందిన లైగర్ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఒక రేంజులో ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా పూరి, విజయ్ ల ద్వయం మరో సినిమా "JGM" ఎనౌన్స్ చేసారు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వీరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కబోతుందని సోషల్ మీడియాలో పలు వార్తలు జోరుగా ప్రచారం చేయబడుతున్నాయి. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. తెలుగులో ఒక సామెతుంటుంది... ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.. అని ... లైగర్ విడుదలవలేదు... JGM షూటింగ్ ఇంకా పట్టాలెక్కనేలేదు .... ఇప్పుడు మూడో సినిమా అంట... అని కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు.