'పిట్టగోడ' ఫేమ్ కేవి అనుదీప్ డైరెక్షన్లో రెండో సినిమాగా తెరకెక్కింది "జాతిరత్నాలు". 2021లో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఈ విషయాన్ని డైరెక్టర్ అనుదీప్ ను అడిగితే, ఆయనిలా సమాధానం చెప్పారు. జాతిరత్నాలు సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని, కాకపోతే ఇప్పుడే కాదు నాలుగైదు సంవత్సరాల తర్వాత ఉండొచ్చు. ఈ సీక్వెల్ ను తెరకెక్కించడంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. జాతిరత్నాలు స్క్రిప్ట్ నవీన్, ప్రియదర్శి, రాహుల్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ... అందరికి నచ్చాలి. ఇంతమందిని ఒప్పించి ఒకే నిర్ణయానికి తీసుకురావటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ...సో, టైం పడుతుంది... అని చెప్పుకొచ్చారు.