రామ్ పోతినేని కెరీర్ లో తొలిసారి పోలీసాఫీసర్ గా నటిస్తున్న చిత్రం "ది వారియర్". కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో కృతిశెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈరోజుల్లో సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవాలంటే, ఆ సినిమాలో సూపర్ హిట్ ఆల్బమ్ ఉండాలి. SR కళ్యాణమండపం, డీజే టిల్లు సినిమాల విషయంలో ఈ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. ఆ రెండు సినిమాల పాటలు విడుదల కు ముందు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందినవి. దీంతో ఆ రెండు సినిమాలకు తొలిరోజు మంచి ఓపెనింగ్స్ రావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టాయి.
సినిమాలో విషయమున్నప్పటికీ ఆకర్షించే వినసొంపైన పాటలు లేకపోతే ఆ సినిమాను థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరని అంటే సుందరానికి, సమ్మతమే సినిమాల విషయంలో క్లియర్ కట్ గా అర్ధమవుతుంది.
పోతే.., ది వారియర్ సినిమాకు ఆడియో ప్రధాన బలంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదలవగా, బుల్లెట్, విజిల్ పాటలు ఆడియన్స్ హాట్ ఫేవరేట్ గా నిలిచాయి. ఈ పాజిటివ్ వైబ్స్ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టేందుకు బాగా ఉపయోగపడతాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని కొంతమంది ముందే జోస్యం చెప్పేస్తున్నారు.