ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఒకరు. స్టేజి మీద ఆయన ఎనర్జీ ఒక రేంజులో ఉంటుంది. మెలోడీ, రాకింగ్ మ్యూజిక్, మాస్ మసాలా సాంగ్స్ ను కంపోజ్ చెయ్యడంలో DSP సిద్ధహస్తుడు. తెలుగులోనే కాక తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా దేవిశ్రీ పని చేసిన దాఖలాలు ఉన్నాయి.
తాజాగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం "కభీ ఈద్ కభీ దివాళి" సినిమాకు దేవినే బాణీలందిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. మరియు విక్టరీ వెంకటేష్ కీరోల్ పోషిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రాకారం, ఈ ప్రాజెక్ట్ నుండి దేవీశ్రీని సల్మాన్ ఖాన్ కావాలనే తప్పించేశారని తెలుస్తుంది. DSP ప్లేస్ లో మరొక స్టార్ కంపోజర్ ను సెలెక్ట్ చేయనున్నారట సల్మాన్.
ఇంతకీ దేవిని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించాల్సిన అవసరమేంటని ఆరా తీయగా, కభీ ఈద్ కభీ దివాళి డైరెక్టర్ సాజిద్ కు DSP కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తెలిసింది. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చేలా లేదు.