నటీనటుల జీతభత్యాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. సినిమా హిట్ ఐతే రెమ్యునరేషన్ పెంచడం, ఫ్లాప్ ఐతే తగ్గించడం చిత్రసీమలో ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ. హీరో, హీరోయిన్, డైరెక్టర్, సపోర్టింగ్ ఆర్టిస్టులు... చిత్రసీమలో ఉండే ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే రూల్ ఇదే అన్నమాట.
కానీ, ఒక హీరో మాత్రం ఫ్లాప్ వచ్చినా రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గనంటున్నాడు. విచిత్రమేంటంటే, ఫ్లాప్ వచ్చిన తర్వాత రెమ్యునరేషన్ ను తగ్గించలేదు ఓకే. పోనీ పాత రెమ్యునరేషన్ నే మెయిన్ టైన్ చేశాడా అంటే అదికూడా కాదు... దాదాపు ఐదు కోట్లు పెంచాడంట. ఇదంతా ఎవరి గురించో కాదు..బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి.
తెలుగు "జెర్సీ"ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేసి డిజాస్టర్ నమోదు చేసాడు షాహిద్. తదుపరి అబ్బాస్ ఆలీ జాఫర్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ సినిమాకు సైన్ చేసిన షాహిద్ తన రెమ్యునరేషన్ ను ఐదు కోట్లు పెంచి మొత్తం నలభై కోట్లను డిమాండ్ చేసాడంట. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.