వెంకీ మామ తరువాత, దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ లాక్ చెయ్యని ఈ మూవీ చిరుకు 154వ సినిమా కావడంతో మెగా #154 గా పిలుస్తున్నారు. ఈ మూవీ పై మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. ఎందుకంటే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య డిజాస్టర్ కావడం, చిరు చేతిలో ఉన్న మిగిలిన రెండు సినిమాలు రీమేక్స్ అవ్వడంతో బాబీ పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు అభిమానులు. భారీ అంచనాలను అందుకోవడంలో బాబీ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
తాజాగా ఈ మూవీ పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే.., మలయాళంలో సూపర్ డూపర్ హిట్ ఐన "అయ్యప్పనం కోషియం" లో హీరో బిజు మీనన్ ను మెగా 154 సినిమాలో విలన్గా సెలెక్ట్ చేసారంట.
మలయాళంలో బిజు మీనన్ స్టార్ హీరో. గతంలో గోపీచంద్ 'రణం', రవితేజ 'ఖతర్నాక్' సినిమాల్లో విలన్గా నటించాడు. ఖతర్నాక్ డిజాస్టర్ తో ఇప్పటివరకు తెలుగులో నటించని బిజు చిరు సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఐతే, మెగా 154 మూవీ టీం ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటివరకు ఇవ్వలేదు. పోతే..., ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉంది.