బాలీవుడ్ మోస్ట్ అడారబుల్ అండ్ క్యూట్ కపుల్ ఆలియాభట్, రణ్ బీర్ కపూర్లు ఇటీవలే తమ మొదటి సంతానం త్వరలోనే రాబోతుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే కదా. పెళ్ళైన మూణ్నెళ్లకే ఆలియా ప్రెగ్నన్సీ ఎనౌన్స్ చెయ్యడంతో పలు రకాల రూమర్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని మరీ విడ్డురంగా అనిపిస్తున్నాయి. అదేంటో చూద్దామా...!
ఈ క్యూట్ కపుల్ మీద ఉన్న పిచ్చి అభిమానంతో కొంతమంది వీరాభిమానులు ఆలియా, రణ్ బీర్ల జాతకాలను పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ కు చూపించి, వీరికి ఎవరు పుడతారనే ప్రశ్నలను అడుగుతున్నారట. ఒక ప్రముఖ జ్యోతిష్యుడి జోస్యం ప్రకారం ఆలియాకు కవలలు పుడతారంట. అదికూడా ఇద్దరూ మగపిల్లలే. మరో జ్యోతిష్యుడి ప్రకారం ఆలియాకు ఒకే ఒక్క ఆడపిల్ల పుడుతుంది. ఇంకొక ప్రముఖ జోతిష్యుడు ఏం చెప్పాడంటే, ఆలియా తన సెకండ్ ప్రెగ్నన్సీని 2024 చివర్లో ఎనౌన్స్ చేస్తుందట..ఇంకా పిల్లల మీద అతి ప్రేమను చూపించి కపూర్ల కుటుంబం ఈ పిల్లలను పాడుచేస్తారట. సెలెబ్రిటీ జంటల ప్రెగ్నన్సీ అంటే సోషల్ మీడియాలో ఈ మాత్రం హడావిడి కొత్తేమి కాదనుకోండి.
ఈ విషయం పక్కన పెడితే, ఆలియా ప్రెగ్నన్సీ అండ్ బేబీ బంప్ ఫోటోషూట్ల కోసం ఆమె అభిమానులు ఇప్పటి నుండే కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.