ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరోసారి మాస్ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది వారియర్ విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్ తో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం తెలుగు - తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల కానుండగా, శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బోయపాటి శ్రీను ముఖ్య అతిధిగా రానున్నారు. రామ్ తదుపరి చిత్రం బోయపాటితో చేయనున్న విషయం తెలిసిందే.