`జయహో`, `హేట్ స్టోరీ 3` వంటి సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి డైసీ షా. హీరోయిన్‌గా మారకముందు మోడల్‌గా, డ్యాన్సర్‌గా ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. తాజాగా ఈమె ఓ షోరూమ్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా తెలుగు సినిమాల గురించి, హీరోల గురించి మాట్లాడింది.
`నాకు హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. షూటింగ్‌ల కోసం పలుసార్లు ఇక్కడకు వచ్చాను. `జయహో` షూటింగ్ ఇక్కడే జరిగింది. నాకు భాష ముఖ్యం కాదు. అన్ని భాషల్లోనూ నటించడానికి నేను సిద్ధమే. తెలుగులో నటించకపోవడానికి కారణం ఇక్కణ్నుంచి అవకాశాలు రాకపోవడమే. ఆ విషయం తెలుగు నిర్మాతలను అడగాలి. చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్‌ల నటన నాకు చాలా ఇష్టం` అని డైసీ బదులిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa