మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్'. ఈ సినిమాకి మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పద్మభూషణ్ నంబినారాయణ్ బయోపిక్‌గా తెరకెక్కింది. ఇటీవలే ఈ సినిమా రిలీజై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాపై పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాని ప్రతి ఒక్క భారతీయుడు, ముఖ్యంగా యువత తప్పకుండా చూడాలని రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా సోమవారం తెలిపారు.ఈ సినిమాని తెరకెక్కించిన మాధవన్‌కు అభినందనలు తెలిపారు.