ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌశల్ మాట్లాడుతున్న స‌మ‌యంలో గణేష్ తల తిక్క సమాధానులు ఇచ్చి

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 28, 2018, 12:34 PM

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 లో ప్రతివారం ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ అంత్యంత రసవత్తరంగా సాగిందని చెప్పొచ్చు. ఆడియన్స్ కు వినోదంతో పాటు ఆసక్తిని రేకెత్తించేలా బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ నిర్వహించారు. ఈవారం నామినేషన్ ఎలా జరిగింది. ఎవరెవరు నామినేట్ అయ్యారో ఇపుడు తెలుసుకుందాం.


హౌస్ లో పదిసార్లు బెల్ మోగుతుంది. బెల్ మోగిన ప్రతి సారి ఇంటిసభ్యుల్లో ఒకరు ముగ్గురిని ఎంపిక చేసుకుని రూమ్ లోపలకు తీసుకుని వెళతారు. ముగ్గురిలో ఒకరిని సేవ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఇద్దరినీ నామినేట్ చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన కారణాలు వివరించాలి.నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు కెప్టెన్ గా దీప్తి బిగ్ బాస్ ని సందేహం అడిగింది. ఈ నామినేషన్ లో కెప్టెన్ గా నాకు మినహాయింపు ఉంటుందా అని అడగగా.. అందుకు బిగ్ బాస్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. హౌస్ లోకి వచ్చి ఇన్నిరోజులు అవుతున్నా నామినేషన్ అంటే భయం పోలేదా అని బిగ్ బాస్ ఘాటుగా బదులిచ్చాడు. దీనితో హౌస్ లో నవ్వులు విరిశాయి.కౌశల్ పై హౌస్ లో సభ్యులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. నామినేషన్ ప్రక్రియలో కేవలం అమిత్, నూతన్ నాయుడు మాత్రమే కౌశల్ ని సేవ్ చేశారు. మిగిలిన వారంతా నామినేట్ చేశారు.నూతన్, శ్యామల ఇద్దరూ ఒకసారి ఎలిమినేట్ అయి, ఆడియన్స్ మద్దత్తుతో మరోమారు హౌస్ లోకి ప్రవేశించారు. బయట ఉన్న సమయంలో వీరిద్దరూ బిగ్ బాస్ గురించి ఆడియన్స్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. నాకు మరో మారు అవకాశం ఇస్తే వాళ్ళందరి అంతు చూస్తా అంటూ నూతన్ సోషల్ మీడియాలో తెలిపిన సంగతి తెలిసిందే


ఈ సంగతులన్నీ తనీష్ కు శ్యామల లీక్ చేసినట్లు నిన్న జరిగిన ఎపిసోడ్ లో తేలిపోయింది. నూతన్ గురించి తెలియడంతోనే తనీష్ ఆయన్ని టార్గెట్ చేశారు.నూతన్ నాయుడుని తనీష్ నామినేట్ చేశాడు. అందుకు గల కారణాలు వివరిస్తూ.. మీరు బయట ఉన్న సమయంలో శపథం చేశారని శ్యామల తెలిపింది. అది కరెక్ట్ కాదు సార్. మీరు అలాంటి వ్యక్తి కాదు అని ఈ నామినేషన్ ద్వారా నిరూపించుకోండి అని తనీష్ తెలిపాడు.నూతన్ నాయుడుని తనీష్ నామినేట్ చేశాడు. అందుకు గల కారణాలు వివరిస్తూ.. మీరు బయట ఉన్న సమయంలో శపథం చేశారని శ్యామల తెలిపింది. అది కరెక్ట్ కాదు సార్. మీరు అలాంటి వ్యక్తి కాదు అని ఈ నామినేషన్ ద్వారా నిరూపించుకోండి అని తనీష్ తెలిపాడు.తనీష్ ఆ మాట అనడంతో నూతన్ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. పక్కనే ఉన్న కౌశల్, రోల్ రైడ ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. నేను అలాంటి వ్యక్తిని కాను. పొరపాటుగా ఒక మాట అని ఉన్నా ఒకరికి కేసు చేయాలనే ఉద్దేశం నా మనసులో లేదు అని నూతన్ నాయుడు ఏడుస్తూ వివరణ ఇచ్చారు.


ఇక కౌశల్ తన వంతు రాగానే గణేష్, సామ్రాట్, అమిత్ ని ఎంపిక చేసుకున్నాడు. గణేష్, సామ్రాట్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. అమిత్ ని సేవ్ చేయడం విశేషం. ఇక గణేష్ ని ఎందుకు నామినేట్ చేశానో అని కౌశల్ వివరిస్తుండగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.గణేష్ తో కౌశల్ మాట్లాడుతూ.. నీలాంటి సోమరిపోతులకు బిగ్ బాస్ లో ఆస్కారం లేదు. అందుకే నిన్ను నామినేట్ చేశా. అసలు నీకు బ్యాటరీలు తీసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి. కౌశల్ మాట్లాడ్తునపుడు గణేష్ తల తిక్క సమాధానులు ఇచ్చి కౌశల్ ని రెచ్చిగొట్టి ప్ర‌య‌త్నం చేశాడు 


కౌశల్ కు ఆడియన్స్ మద్దత్తు ఉన్నా ఇంటి సభ్యులలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అమిత్, నూతన్ మినహా మిగిలిన వారంతా కౌశల్ ని నామినేట్ చేశారు. దీనితో ఈ వారం కూడా కౌశల్ నామినేట్ అయ్యాడు. కౌశల్ తో పాటు నూతన్, గణేష్, సామ్రాట్, అమిత్ ఈ వారం నామినేట్ అయ్యారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa