సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం'. ఈ సినిమాలో తమన్నా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్యశెట్టి కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. జూలై 15న విడుదల కావాల్సిన ఈ సినిమాని ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీనికి సంబందించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు.