నాచురల్ స్టార్ నాని నటించిన "అంటే సుందరానికి" సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అంతకుముందు రౌడీ బాయ్స్ తో రొమాన్స్ చేసిన ఈ మలయాళ ముద్దుగుమ్మ తదుపరి నిఖిల్ "కార్తికేయ 2", "18 పేజెస్" సినిమాలలో ఫిమేల్ లీడ్ లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా కొన్ని వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి. కానీ, అనుపమ లీడ్ రోల్ పోషించిన "బట్టర్ ఫ్లై" చిత్రం మాత్రం డైరెక్ట్ ఓటిటిలో విడుదల కానుంది.
థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన బట్టర్ ఫ్లై చిత్రానికి ఘంటా సతీష్ బాబు డైరెక్టర్ గా వ్యవహరించగా, జెన్ నెక్స్ట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిహాల్, సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కీ రోల్స్ పోషించిన ఈ చిత్రం థియేటర్లలో కాకుండా, ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతుందని అధికారిక సమాచారం. త్వరలోనే విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.