"పుష్ప" పాన్ ఇండియా గ్రాండ్ సక్సెస్ తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వరుస వెకేషన్ ల కెళుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. గోవా, లండన్, దుబాయ్ లలో ఎంజాయ్ చేసొచ్చిన బన్నీ అండ్ ఫ్యామిలీ తాజాగా ఈస్ట్ ఆఫ్రికా వెకేషన్ కెళ్ళాడు. పుష్ప అనూహ్య విజయం తర్వాత బన్నీ వెళ్లిన నాలుగో వెకేషన్ ఇది. ఈమేరకు టాంజానియా లో ప్రసిద్ధి చెందిన సెరెంగెటి నేషనల్ పార్క్ ను బన్నీ అండ్ ఫ్యామిలీ సందర్శించారు. అక్కడ దిగిన ఫోటోను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్ లో బన్నీ ఫ్యామిలీ తళ తళ మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.