క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం "పుష్ప". గతేడాది విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నార్త్ లో ఐతే ఈ సినిమా ఒక ప్రభంజనం. దీంతో పుష్ప సీక్వెల్ పై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పటి నుండో పుష్ప సీక్వెల్ పై వినిపిస్తున్న పుకారొకటి నిజమేనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
అదేంటంటే.., పుష్ప సినిమా స్టార్టింగ్ లో కనిపించే DSP గోవిందప్ప పాత్రలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర మిస్ అయినా, పుష్ప సీక్వెల్ లో మాత్రం విజయ్ సేతుపతి నటించడం ఖాయమని ఇండస్ట్రీలో బలంగా వినబడుతున్న వార్త. మరి విజయ్ పోషించబోయేది పోలీసాఫీసర్ పాత్రనా లేక మరొక పాత్రా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే, ఈ విషయంలో త్వరలోనే అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.