టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళికి, భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని తెరకెక్కించడమే డ్రీం ప్రాజెక్ట్ అన్న విషయం చాలామందికి తెలిసిందే. ఐతే, ఈ సినిమా తీయటానికి తనకున్న అనుభవం సరిపోదని, ఇంకా కావాలని పలు సందర్భాల్లో రాజమౌళి చెప్పారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. తన డ్రీం ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
"మహాభారతం" ను ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించాలన్నది తన చిరకాల కోరికని, ఐతే, అందుకు ఇప్పుడే సమయం కాదని చెప్పారు. తన తదుపరి మూడు, నాలుగు ప్రాజెక్టుల తర్వాతే మహాభారతం కాన్సెప్ట్ ను టచ్ చేస్తానని చెప్పారు. రాజమౌళి ఒక్కో సినిమాకు కనీసం మూడు నుండి నాలుగేళ్ళ సమయం తీసుకుంటాడు. అంటే మహాభారతాన్ని రాజమౌళి డైరెక్ట్ చెయ్యాలంటే, దాదాపు పది నుండి పన్నెండేళ్ల సమయం తప్పకుండా పడుతుంది.