మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా, షాజీ కైలాష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "కడువా". ఈ చిత్రంలో సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియ మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. జూలై 1వ తేదీన తెలుగు, మలయాళం భాషలలో విడుదల కావాల్సిన ఈ చిత్రం జూలై 7వ తేదికి వాయిదా పడింది. పోతే..., ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
తాజాగా కడువా మూవీకి సంబంధించి ఓటిటి పార్టనర్ ఖరారైనట్టు తెలుస్తుంది. కడువా మూవీ డిజిటల్ హక్కులను ప్రఖ్యాత ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ డీసెంట్ ధరకు కొనుగోలు చేసిందని టాక్. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ మూవీ తెలుగు టీజర్ ఇటీవలనే విడుదలవగా, ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.