టాలీవుడ్ హీరో సుమంత్ తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు. సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే 'సుబ్రహ్మణ్యపురం' అనే సినిమా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమాను కె.ప్రదీప్ నిర్మించనున్నారు. పురాతన దేవాలయం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తీయనున్నారు. త్వరలో షూటింగ్ షురూ కానుంది. ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.