తన ఆరోగ్యం బాగాలేదన్న వార్తలపై హీరోయిన్ శృతి హాసన్ తాజాగా స్పందించింది. తాను ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నానని చెప్పింది. తాజాగా తాను పోస్ట్ చేసిన ఎక్సర్ సైజ్ వీడియో చూసి మీడియా సంస్థలు ఏదో రాస్తున్నాయని, ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని చేశానని చెప్పింది. తనకు కొన్నేళ్లుగా పీసీఓఎస్ ఉందని, మరేమీ లేదని చెప్పింది.