గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, నటించిన సమ్మతమే సినిమా జూన్ 24, 2022న థియేటర్లలో విదుదల అయ్యింది. చాందిని చౌదరి ఈ సినిమాలో కిరణ్ సరసన జంటగా నటిస్తోంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని మంచి వాసుల్ని రాబడుతుంది. తాజాగా ఇప్పుడు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ఆహా ఈ చిత్రాన్ని అతి త్వరలో తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం జూలై 22, 2022 నుండి ఆహాలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి టీమ్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.