బుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. తనకు స్టార్డం తెచ్చిపెట్టిన "జబర్దస్త్" షో నుండి ఇటీవలే తప్పుకున్న అనసూయ ఇకపై పూర్తిగా సినిమాలే మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలని భావిస్తోందట. ఇప్పటికే అనసూయ రంగస్థలం, క్షణం, థాంక్యూ బ్రదర్, పుష్ప వంటి సినిమాలలో ఇంటెన్స్ రోల్స్ ను పోషించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. త్వరలోనే సందీప్ కిషన్ "మైఖేల్", దర్జా, వాంటెడ్ పండుగాడ్ సినిమాలలో కనిపించబోతుంది.
తాజాగా అనసూయ ఒక గోల్డెన్ ఆపర్చ్యునిటీని కొట్టేసిందని టాక్. క్రిష్ డైరెక్షన్లో "కన్యాశుల్కం" అనే వెబ్ సిరీస్ రూపొందుతుండగా, అందులో వేశ్య పాత్రలో నటించే అద్భుతమైన అవకాశాన్ని అనసూయ చేజిక్కించుకుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. క్రిష్ డైరెక్షన్లోనే రూపొందిన వేదం సినిమాలో అనుష్క కూడా సరోజ అనే వేశ్య పాత్రను పోషించి, టాప్ హీరోయిన్ కి ఉండాల్సిన పరిమితులను చెరిపేసింది. ఆ పాత్ర అనుష్కకు చాలా మంచి పేరును, క్రేజ్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు అనసూయ కూడా అనుష్క పోషించిన పాత్రనే పోషించబోతుండడంతో ఆమె స్టార్డం కూడా భారీగా పెరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో...?