2019లో వచ్చిన "మల్లేశం" సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలంగాణా అమ్మాయి అనన్యా నాగళ్ళ. అయితే 2021లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో ఒక కీలక పాత్ర ను పోషించి లైం లైట్ లో కొచ్చింది. ఆ సినిమాలో నివేదా థామస్, అంజలి తో పాటు నటించిన అనన్యకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అప్పటి నుండి వరస ఫోటోషూట్లను చేస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ హంగామా చేస్తుంది. వకీల్ సాబ్ సినిమా తర్వాత నుండి ఈ అమ్మడికి వరస పెట్టి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న శాకుంతలం లో నటిస్తుంది అనన్య.
తాజాగా కొత్త దర్శకుడు సూర్య అల్లంకొండ డైరెక్షన్లో తెరెక్కుతున్న ఒక చిత్రంలో అనన్య ఫిమేల్ లీడ్ రోల్ కి సెలెక్ట్ అయ్యింది. "విందు భోజనం" ఫేమ్ అఖిల్ రాజ్ ఇందులో హీరోగా నటిస్తుండగా, శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై ప్రతాప్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చెయ్యనుంది. ఈ కార్యక్రమానికి రానా తమ్ముడు అభిరాం చీఫ్ గెస్ట్ గా పాల్గొని ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.