'కాళీ' డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమేఖలై మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. శివపార్వతుల వేషాధారణలో ఉన్న వ్యక్తులు సిగరెట్ తాగుతున్న ఫొటోను ఆమెను గురువారం షేర్ చేశారు. అయితే, ఇది తన డాక్యుమెంటరీలోనిది కాదని, గ్రామీణ భారతంలోని నిజ జీవిత దృశ్యమని సమర్థించుకున్నారు. కాగా, కాళీమాతపై చేసిన పోస్ట్‌కు సంబంధించి మణిమేఖలైపై దేశంలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి.